చ‌లిపంజా…

తెలంగాణ‌లో చలి పంజా విసురుతోంది. దీంతో ప్ర‌జ‌లు గజ గజ వణికిపోతున్నారు. చలికి తోడు గాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తూర్పు, ఈశాన్య దిక్కుల నుండి వీస్తున్న గాలులతోనే చలి తీవ్రత పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్టోగ్రతలు పడిపోయాయి. సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు నమోదవతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న‌ ఏజేన్సీ ప్రాంతాలు కొన్ని రోజులుగా చలికి వణికిపోతున్నాయి. రాష్ట్రంలో సంగారెడ్డిలో కోహిర్‌లో అత్య‌ల్పంగా 6.5 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదు అయ్యింది. సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. మ‌రో వారం రోజుల పాటు ఇలాగే కొన‌సాగుతుంద‌ని అధికారులు చెబుతున్నారు. గ‌తంతో పోల్చితే సాధారణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా న‌మోదైన అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు

కోహిర్ (సంగారెడ్డి) – 6.5
రెడ్డిప‌ల్లి (రంగారెడ్డి) – 7.1
స‌త్వ‌ర్ (సంగారెడ్డి) – 7.3
మ‌ర్రిప‌ల్లి (వికారాబాద్‌) – 7.4
అల‌గొలె (సంగారెడ్డి) – 8.1
న‌ల్ల‌వ‌ల్లి (సంగారెడ్డి) – 8.2
చంద్ర‌వెల్లి (సంగారెడ్డి) – 8.3
గిన్నెధ‌రి (కొమురంభీమ్‌) – 8.3

Get real time updates directly on you device, subscribe now.

You might also like