చంద్రబాబుకు రిమాండ్ పొడిగింపు

Chandrababu remand extended for two more days: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. చంద్రబాబుకు విధించిన జ్యుడీషియల్‌ రిమాండు శుక్రవారం ముగియడంతో విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఆన్‌లైన్ పద్ధతిలో హాజరుపరిచారు. దీంతో చంద్రబాబు రిమాండ్ 24 వరకు కోర్టు పొడిగించింది.

ఈ సంద‌ర్భంగా జ‌డ్జీ చంద్ర‌బాబుతో సీఐడీ కస్టడీ అడుగుతోంది అభిప్రాయమేంటని అడిగారు. ‘మీ లాయర్లు కస్టడీ అవసరం లేదని వాదించారని కస్టడీకి ఇస్తే మీకేమైనా ఇబ్బంది ఉంటుందా?’ అని అడిగారు. అక్రమంగా తనను అరెస్ట్ చేశారని.. తన గురించి దేశం, రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. తన హక్కుల్ని రక్షించాలని న్యాయాన్ని కాపాడాలని కోరారు. తనపై రాజకీయంగా కక్షసాధిస్తున్నారన్నారు. తనకు నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని.. తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్ట్ చేయాల్సింది తెలిపారు. తన మీద ఉన్నవి ఆరోపణలు మాత్రమేనని.. చట్టం ముందు అందరూ సమానమేనని, న్యాయాన్ని గౌరవిస్తానన్నారు.. చంద్రబాబు చెప్పిన విషయాలను జడ్జి నోట్ చేసుకున్నారు.

‘మీరు పోలీసు కస్టడీలో లేరు.. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. మీరు దీన్ని శిక్షగా భావించవద్దు. మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే.. నేర నిరూపణ కాలేదు. చట్టం, నిబంధనల ప్రకారమే మీకు రిమాండ్‌ విధించాం’ అని విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి చంద్రబాబుకు తెలిపారు. మరోవైపు చంద్రబాబుకు అందుతున్న సౌకర్యల గురించి జైలు అధికారులను కోర్ట్ ఆరా తీసింది. దీనికి కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు సౌకర్యాలు కల్పించామని రాజమండ్రి జైలు అధికారులు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like