తెలివైన దొంగ‌లు

Theft in Manchiryal: ఈ మ‌ధ్య కాలంలో దొంగ‌లు చాలా తెలివి మీరుతున్నారు. పోలీసులు ఏయే కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నారో తెలుసుకుని మ‌రీ వారికి చిక్క‌కుండా దొంగ‌త‌నాలు చేస్తున్నారు. దొంగ‌త‌నాలు జ‌రిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాల‌ను బ‌ట్టి పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే, వాటికి చిక్క‌కుండా ఉండేందుకు సీసీ కెమెరాలు సైతం ఎత్తుకుపోతున్న దొంగ‌లు తాజాగా సీసీ కెమెరాల ఫుటేజీ రికార్డు చేసే డీవీఆర్ సైతం ఎత్తుకెళ్లారు…. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా పాత మంచిర్యాల సాయిబాబా ఆల‌యంలో మంగ‌ళ‌వారం రాత్రి దొంగ‌త‌నం జ‌రిగింది. ఉద‌యం ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీకి సంబంధించిన డీవీఆర్‌ ప‌రిశీలించేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే, దొంగ‌లు హుండీలోని న‌గ‌దుతో పాటు దానిని సైతం ఎత్తుకుపోయారు. కొంత బంగారం, వెండి సైతం దొంగ‌త‌నం చేశారు. పోలీసులు ఫింగ‌ర్ ప్రింట్స్ సేక‌రించి కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆల‌య పాల‌క‌మండలి స‌భ్యుల వ‌ద్ద సీసీ ఫుటేజీకి సంబంధించి సెల్ కెమెరాలో రికార్డు అయిన దానిని ప‌రిశీలిస్తున్న పోలీసులు దొంగ‌ల‌ను గుర్తించే ప‌నిలో ప‌డ్డారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like