ట్రాన్స్‌జెండ‌ర్ల ఆందోళ‌న

Transgenders: త‌మ‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ్యెద్ద‌ని ట్రాన్స్‌జెండ‌ర్లు కోరారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్ర‌హం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్బంగా మంచిర్యాల జిల్లా ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఐదు రోజుల కింద‌ట‌ మందమర్రి రైల్వే స్టేషన్లో ట్రైన్ నుండి ప్రయాణికున్ని కిందకు తోసేసామని తప్పుడు కథనాలు ప్రచురించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం చేయొద్దని వారు కోరారు. 20 సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాలో ట్రాన్స్ జెండర్స్ గా బిక్షాట‌న చేస్తున్నామన్నారు. తాము ఎప్పుడు కూడా ఎవ‌రిని బెదిరించ‌లేద‌న్నారు.

తాము బిక్షాటన చేస్తూ తమ కుటుంబాలను కాపాడుకుంటున్నామని తెలిపారు. కొంతమంది పనిగట్టుకుని సోషల్ మీడియాలో త‌మ‌పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నార‌ని ఈ సందర్భంగా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌ను మానసికంగా ఇబ్బందులు గురిచేశారని ఆరోపించారు. తాము ఇప్పుడిప్పుడే జనజీవ స్రవంతిలోకి వ‌స్తున్నా త‌మ‌పై ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఇబ్బందుల గురిచేయడం సమంజసం కాదన్నారు. రైళ్లలో ఏ ఒక్క ప్రయాణికుని పై కూడా తామేప్పుడు దాడి చేయ‌లేద‌ని తెలిపారు. ఇప్పటికైనా హిజ్రాలపై తప్పుడు కథనాలు రాయొద్దని విజ్ఞప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like