పోలీసుస్టేషన్ లోనే కాంగ్రెస్, టీఆర్ఎస్ బాహాబాహి

Congress and TRS are babbling in the police station itself:కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ఏకంగా పోలీసుస్టేషన్ లోనే బాహాబాహికి దిగారు. వివరాల్లోకి వెళితే.. ఓదెల మండలం మానేరు నది ఇసుకకు సంబంధించిన వివాదం కొనసాగుతోంది. ఈ ఇసుక తరలింపులో పెద్దపల్లి ఎమ్యెల్యే హస్తం ఉందని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆరోపించారు. ఆదివారం ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రమాణం చేయాలంటూ ఆయన విసిరిన సవాల్ తో నియోజకవర్గంలో రాజకీయం ఒకసారి వేడెక్కింది. టిఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయానికి వెళ్లకుండా ఎక్కడికి అక్కడ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సుల్తానాబాద్ మండలానికి చెందిన కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు అరెస్టు చేసి ఠాణకు తరలించారు. ఠాణాలో రెండు వర్గాల నాయకులు విమర్శలు చేసుకోవడటంతో పాటు గొడవకు దిగారు. ఒక దశలో బాహాబాహికి దిగారు. వీరిని అదుపు చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like