జిల్లా బంద్‌కు కాంగ్రెస్ పిలుపు… నేత‌ల అరెస్టు

Congress: రైతుల‌కు సాగు నీరందించాల‌ని కాంగ్రెస్ నేత‌లు జిల్లా బంద్‌కు పిలుపునివ్వ‌డంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు స్టేష‌న్ త‌ర‌లించారు.

గూడెం ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద రైతుల‌కు సాగు నీరు అందించాల‌ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం మంచిర్యాల జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. క‌డెం ప్రాజెక్టు ఆయ‌క‌ట్టు పంట‌పొలాల‌కు సాగునీరు అందించ‌క రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో రెండు రోజుల పాటు నిరాహార దీక్ష సైతం చేశారు. అయినా, ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మంచిర్యాల జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్న‌ట్లు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్ప‌ష్టం చేశారు. గురువారం ర్యాలీ నిర్వ‌హిస్తున్న కాంగ్రెస్ నేత‌ల‌ను పోలీసులు అడ్డుకుని స్టేష‌న్ త‌ర‌లించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు తూముల న‌రేష్‌, బ్లాక్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు పూద‌రి తిరుప‌తి, పీసీసీ స‌భ్యుడు కొండ చంద్ర‌శేఖ‌ర్‌, కౌన్సిల‌ర్లు రామ‌గిరి బానేష్‌, డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్లు సంజీవ్, మాజీద్‌, బీసీ సెల్ జిల్లా అధ్య‌క్షుడు వడ్డె రాజ‌మౌళి, పూదరి ప్ర‌భాక‌ర్‌, మోహ‌న్ రెడ్డి, చింత‌కింద మ‌ల్ల‌య్య, జిల్లా మ‌హిళా కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ పుట్ట లావ‌ణ్య‌, న‌క్క రాజేశ్వ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like