ష్… గప్ చుప్..

-చిన్నయ్య ఎపిసోడ్ పై కాంగ్రెస్ మౌనముద్ర
-విలేకరుల సమావేశం పెట్టాలని బెల్లంపల్లి నేతల నిర్ణయం
-వద్దన్న నేతలు

ఆయన ఎంఎల్ఏ… ఒక మహిళను వేధించాడని, తమ వద్ద లక్షలు కాజేసాడని పెద్ద ఎత్తున అభియోగాలు వచ్చాయి. పత్రికలు, చానల్లో పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచురితం అయ్యాయి. అవుతున్నాయి కూడ.. ఆ సమయంలో ఎక్కడైనా ప్రతిపక్షం ఏం చేస్తుంది… ఎంఎల్ఏ మీద దుమ్మెత్తి పోస్తుంది. ప్రజల్లో చైతన్యం తెచ్చి తమకి మైలేజీ, అధికార పక్షం మీద వ్యతిరేకత పెంచుతుంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా నడుస్తోంది.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎంఎల్ఏ దుర్గం చిన్నయ్య మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆరిజన్ డైరీ వ్యవహారంలో తనను వేధించాడన సంస్థ డైరెక్టర్ సేజల్ ఆరోపించారు. ఆ సంస్థ సీఈవో ఆదినారాయణ సైతం ఎంఎల్ఏ పై ఆరోపణలు గుప్పించారు. తమకు ప్రభుత్వ భూమి కట్టబెట్టేందుకు ప్రయత్నం చేశారని పెద్దఎత్తున డబ్బులు సైతం తీసుకున్నారని ఆరోపించారు. అమ్మాయిలను సైతం పంపించమంటే పంపించామని వెల్లడించారు.

దీంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. అయితే, ఈ విషయంలో స్పందించాల్సిన కాంగ్రెస్ పార్టీ కనీసం పెదవి విప్పకపోవడం పట్ల పలువురు ఆశర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే పాదయాత్రలో ఉన్న సీఎల్పి నేత భట్టి విక్రమార్క ఆ విషయంలో స్పందిస్తూ తనకు సభ్యత అడ్డు వస్తోందని అన్నారు. తనది ఎంఎల్ఏ స్థాయి కాదని ముఖ్యమంత్రి, రాష్ట్ర స్థాయి వ్యవహారాలు మాత్రమే మాట్లాడుతానని ఆయన చెప్పకనే చెప్పారు.

ఇక, ఈ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన స్థానిక నాయకత్వం మౌనం వహిస్తోంది. జిల్లా నేతలు, కనీసం బెల్లంపల్లి నేతలు కూడా సైలెంట్ గా ఉండటం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద వ్యవహరంలో సైలంట్ గా ఉండటం ఏమిటని అంటున్నారు. వాస్తవానికి బెల్లంపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ నేతలు విలేఖరుల సమావేశం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ మాజీ ఎంఎల్సీ ప్రేమ్ సాగర్ రావు వద్దని చెప్పినట్లు సమాచారం. దీంతో పార్టీ శ్రేణులు సైలెంట్ అయ్యాయి.

ఈ విషయంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కూడా మాట్లాడకపోవడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళకు జరిగిన అన్యాయం పై గలమెత్త కపోవడం దారుణమని దుయ్యబడుతున్నరు. ప్రేమ్ సాగర్ రావు మొదటి నుండి బీఅర్ఎస్ అనుకూలంగా ఉంటారనే అపవాదు ఈ విషయం లో నిజమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం లో తమ పార్టీ నేతలు మాట్లాడి, ఆందోళనలు చెస్తే పార్టీకి మంచి మైలేజ్ వచ్చేదని, బీఅర్ఎస్ పార్టీకి వ్యతరేకత పెరిగేదనీ తమ నేతలు ఆ అవకాశాన్ని చేజేతులా వదులుకొన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులే వ్యాఖ్యనిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like