మంచిర్యాల‌లో కాంగ్రెస్‌కు షాక్‌..

ప‌లువురు కౌన్సిల‌ర్లు కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. మంచిర్యాల‌లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిల‌ర్లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆధ్వ‌ర్యంలో వారు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 20 వార్డు కౌన్సిలర్ అంకం న‌రేష్‌, 26 వార్డ్ కౌన్సిలర్ నాంపల్లి మాధవి శ్రీనివాస్, 15వ వార్డ్ కౌన్సిలర్ శ్రీరాముల సుజాత మల్లేష్, 7 వార్డ్ కౌన్సిలర్ బాణావత్ ప్రకాష్ నాయక్, న‌స్పూరు మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ ప్ర‌కాష్‌రెడ్డి త‌దిత‌రులు టీఆర్ఎస్‌లో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యుడు నడిపెల్లి దివాకర్ రావు, మునిసిపల్ ఛైర్మన్ పెంట రాజయ్య, యువనాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, పట్టణ అధ్యక్షులు పల్లెం తిరుపతి, మాజీ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, నస్పూర్ పట్టణ ఉపాధ్యక్షులు సంతోష్ చారి, మంచిర్యాల పట్టణ సెక్రెటరీ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. కేసిఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వ‌ర్యంలో చేరిన‌ట్లు కౌన్సిల‌ర్లు వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like