కాంగ్రెస్‌లో చేరిన న‌ల్లాల ఓదెలు దంప‌తులు

ఢిల్లీ :చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. అనంతరం ఓదెలు దంపతులకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. న‌ల్లాల ఓదెలు 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున చెన్నూర్ నుండి పోటీచేసి గెలుపొందారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం జరిగిన ఉద్యమంలో భాగంగా 2010 ఫిబ్రవరి 14న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఓదెలు 2010, జూలై 30న జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. 2014లో జరిగిన తెలంగాణ తొలి శాసనసభ ఎన్నికల్లో సైతం విజ‌యం సాధించారు. తెలంగాణ విప్ గా కూడా ప‌నిచేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like