కాంగ్రెస్‌లో లొల్లి.. జ‌రిగింది మ‌ళ్లీ..

కాంగ్రెస్‌లో గ్రూపు రాజ‌కీయాలు కామ‌న్‌.. గొడ‌వ‌లు కూడా కామ‌నే.ఇక్క‌డ కూడా అదే జ‌రిగింది. మంచిర్యాల జిల్లాలో సైతం గ్రూపు గొడ‌వ‌ల‌తో రెండు వ‌ర్గాల కార్య‌క‌ర్త‌లు గొడ‌వప‌డ్డారు. మరోసారి ఇక్క‌డ గ్రూపు రాజకీయాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. కొద్దిసేపు క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఉద్రిక‌త్త సైతం నెల‌కొంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ జన చైతన్య యాత్రలో భాగంగా ధర్నాలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ హనుమంతరావు వ‌చ్చారు. దీంతో ప్రేంసాగ‌ర్ రావు వ‌ర్గం ఆయ‌న‌ను అడ్డుకుంది. ప్రేమ్ సాగర్ అనుచరులు, వీహెచ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఐఎన్‌టీయూసీ ప్రధానకార్యదర్శి జనక్ ప్రసాద్ వాహనాన్ని సైతం అడ్డుకున్నారు. దీంతో కొద్ది సేపు అక్క‌డ ఉద్రిక్త వాతావార‌ణం ఏర్ప‌డింది. అయితే పోలీసుల జోక్యంతో హ‌న్మంత‌రావు, మాజీ మంత్రి వినోద్, రాములు నాయక్ను కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతించారు. వారు అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ కు వినతి మాత్రం అందజేసి వెళ్లిపోయారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like