సింగ‌రేణిని మింగేసే కుట్ర‌

Conspiracy to swallow Singareni: మోదీ ప్ర‌భుత్వం సింగ‌రేణిని మింగేసే కుట్ర చేస్తోంద‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాలుగు బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని నిరరిస్తూ మంద‌మ‌ర్రి అంబేద్క‌ర్ చౌర‌స్తాలో ఆందోళ‌న నిర్వ‌హించి కేంద్ర ప్ర‌భుత్వ దిష్టిబొమ్మ ద‌హ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నాయ‌కులు మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి మోదీ ప్ర‌వ‌ర్త‌న‌ నోటితో మాట్లాడుతూ నొస‌టితో వెక్కింరించిన‌ట్లుగా ఉంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇక్క‌డ‌కు వ‌చ్చి సింగ‌రేణిని ప్రైవేటీక‌రించ‌మ‌ని చెప్పిన మాట మ‌రువ‌క‌ముందే బొగ్గు బ్లాక్ ల వేలం వేస్తున్నార‌ని ఇది ఏ మేర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. సింగ‌రేణిని బొంద పెట్టే కుట్ర ప‌న్నిన మోదీ ప్ర‌భుత్వాన్ని వ‌దిలిపెట్టే ప్ర‌సక్తే లేద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సెంట్ర‌ల్ క‌మిటీ వైస్ ప్రెసిడెంట్ బ‌డికెల సంప‌త్ కుమార్, సెంట్ర‌ల్ క‌మిటీ స‌భ్యులు మిట్ట సూర్య‌నారాయ‌ణ‌, సీహెచ్ ర‌మ‌ణ‌, జీఎం క‌మిటీ స‌భ్యులు డీ.శంక‌ర్‌రావు, కే.ల‌క్ష్మ‌ణ్‌, ఏరియా సెక్ర‌ట‌రీ ఎం.ఈశ్వ‌ర్‌, పిట్ సెక్ర‌ట‌రీలు కొండ‌ల్‌రావు, గాలిపెల్లి తిరుప‌తి, మ‌ద్దెల శంక‌ర్‌, రాజ్‌కుమార్‌, దాస‌రి శ్రీ‌నివాస్‌, మాజీ ఏరియా ఉపాధ్య‌క్షుడు జే.ర‌వీంద‌ర్‌, టీఆర్ఎస్ నాయ‌కులు మ‌ద్ది శంకర్‌, బొరిగం వెంక‌టేష్‌, బ‌ట్టు రాజ్‌కుమార్‌, ఎండీ ముస్తాఫా, స‌రిత‌, నిరోష‌, రేఖ‌, సులోచ‌న‌, స‌త్య‌వ‌తి,రోజ‌, వైద్యం ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like