కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె

మంచిర్యాల : సింగరేణిలో ఉన్న సివిల్ కాంట్రాక్టర్స్ సమస్యలు ప‌రిష్క‌రించాల‌ని లేక‌పోతే స‌మ్మె త‌ప్ప‌ద‌ని సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ బెల్లంపల్లి కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. బుధవారం బెల్లంపల్లి జనరల్ మేనేజర్,సివిల్ డివైజీఎంకి వినతిపత్రం ఇచ్చారు. అనంత‌రం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మార్చి 23న సివిల్ కార్పొరేట్ కార్యాలయం నుండి జారీ చేసిన కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ సర్క్యులర్ వెంటనే రద్దు చేయాలన్నారు. కాంట్రాక్టర్ కి సింగరేణి ఇచ్చే సిమెంట్, స్టీల్ రద్దు చేయాల‌న్నారు. మార్కెట్ నుంచి మెటీరియ‌ల్ కాంట్రాక్టర్ కొనుగోలు చేసేలా అనుమ‌తి ఇవ్వాల‌న్నారు. ఈ మెటీరియ‌ల్ విత్ ఇన్ వాయిస్ ప్రకారం బిల్లులో క‌ల‌పాల‌న్నారు. ప్రతి సంవత్సరం కొత్త ధరలతో ఎస్ఆర్‌ మార్చాలని డిమాండ్ చేశారు. మినీ ట్రేట్ సైకిల్ సిస్టంలో పనులను చేర్చి అందరికీ పనులు వచ్చే విధంగా చూడాల‌న్నారు. రూ. 30 లక్షల రూపాయలు విలువ ఉన్న పనులను సైతం సైకిల్ సిస్టంలో పొందుపరచాలని కోరారు.

కాంట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ కాలపరిమితి పది సంవత్సరాలు పొడగించాల‌న్నారు. అదే క్లాసు లో రెన్యువల్ చేసుకునే కాంట్రాక్టర్లకు ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్లు అడగవ‌ద్ద‌ని కోరారు. కాంట్రాక్టర్లకు పనులకు సంబంధించిన బిల్లులను అందించిన వారం రోజుల్లోపు పేమెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ 15 రోజుల లోపు సింగరేణి సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్తో యాజమాన్యం చర్చించాలన్నారు. లేక‌పోతే సింగరేణి వ్యాప్తంగా అన్ని డివిజన్లలో సివిల్ పనులు, అవుట్సోర్సింగ్ పనులు నిలిపివేస్తామన్నారు. కొత్తగా వేసిన టెండర్ల లో పాల్గొనబోమని సమ్మె చేస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బెల్లంపల్లి అసోసియేషన్ కాంట్రాక్టర్స్ ముక్కు గోపి రెడ్డి, ముత్యాల‌ పైడిధర్, అంగల‌ మురళి, రామగౌని మహీధర్ గౌడ్, ఏ.శ్రీనివాసరావు, పరకాల సాగర్ గౌడ్, సురేష్ గుప్తా, కేసరి ఆంజనేయులు గౌడ్, బొద్దున రమేష్, బి.సమ్మయ్య, బీ.శివకుమార్,ఎం. నర్సాగౌడ్, బీ.మధూకర్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like