పెద్ద కొడుకు నామినేష‌న్‌కు పెన్ష‌న్ విరాళం

Mukhra(k): కేసీఆర్ ఆస‌రా ప‌థ‌కానికి చాలా మంది ఆనందం వ్య‌క్తం చేస్తారు.. త‌మ‌కు పెద్ద కొడుకులా… అండ‌గా ఉండి ఆస‌రా పెన్ష‌న్ అందిస్తాడ‌ని చెబుతుంటారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులతో పాటు ఈ పెన్ష‌న్ అందుకునే ప్ర‌తి ఒక్క‌రూ ముఖ్య‌మంత్రి ప‌ట్ల త‌మ కృత‌జ్ఞ‌తాభావం తెలియ‌జేస్తారు. ఈ పెన్ష‌న్ దారులంతా ఏక‌ప‌క్షంగా బీఆర్ఎస్‌కే ఓటేశార‌ని అందుకే ఆ పార్టీ మెజారిటీ సాధించింద‌నేది కాద‌న‌లేని స‌త్యం.

తాజాగా, త‌మ మ‌ద్ద‌తు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కే ఉంటుంద‌ని చాటి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కె) గ్రామానికి చెందిన 100 మంది పించన్ దారులు కేసీఆర్ నామినేషన్ కోసం పించన్ డబ్బులు విరాళంగా ప్రకటించారు. ఒక్కొక్కరు వెయ్యి రూపాయల చొప్పున వంద మంది లక్ష రూపాయలు జమచేసారు. తమ పించన్ డబ్బులను గ్రామ సర్పంచ్ మీనాక్షికి అందజేసారు. ఈ డబ్బులను కేసీఆర్ కు అందజేయాలని పించన్ దారులు సర్పంచ్ ను కోరారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద కొడుకులా నెల నెలా పించన్ అందిస్తున్నార చెప్పారు. ఈ పించన్లను మరింత పెంచుతామని ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీ సైతం గుర్తు చేశారు. తమకు ఆసరాగా నిలిచిన కేసీఆర్ కు ఎన్నికల సమయంలో తాము ఆసరాగా నిలవాలనుకుంటున్నామని… అందుకోసమే ఆయన నామినేషన్ కోసం తమ పించన్ డబ్బులు విరాళంగా ఇస్తున్నామని ముఖరం కె గ్రామానికి చెందిన పించన్ దారులు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like