కార్పొరేష‌న్ చైర్మ‌న్లు… అధికారుల రాజీనామాలు..

Telangana: వ‌రుస‌ రాజీనామాల ప‌ర్వం కొన‌సాగుతోంది. కేసీఆర్ ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న అధికారులు రాజీనామాలు చేస్తుండ‌గా, తాజాగా రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు సైతం ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. ఆయా కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిస్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో త‌మ‌కు అవకాశం కల్పించిన కేసీఆర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల కనుగుణంగా పని చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రాజీనామా చేసిన వారిలో చైర్మ‌న్లు వ‌రుస‌గా… రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్-సోమ భరత్ కుమార్, తెలంగాణ సాహిత్య అకాడమీ-జూలూరి గౌరీ శంకర్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్-పల్లె రవి కుమార్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ- డాక్టర్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ ఫుడ్ కార్పొరేష‌న్-మేడె రాజీవ్ సాగర్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ-దూదిమెట్ల బాలరాజు యాదవ్, టెక్స్ టైల్ కార్పొరేష‌న్-గూడూరు ప్రవీణ్‌, బేవరేజెస్ కార్పొరేషన్ గ‌జ్జెల నగేష్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్-అనిల్ కూర్మాచలం, ట్రైకార్ – రామచంద్ర నాయక్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ-వలియా నాయక్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ-డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పౌర సరఫరాల సంస్థ-రవీందర్ సింగ్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్-జగన్మోహన్ రావు త‌దిత‌రులు రాజీనామా బాటప‌ట్టారు.

తెలంగాణ పోలీస్‌లోని యాంటీ నక్సల్ ఇంటెల్ వింగ్, ఎస్‌ఐబి (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ టి ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఆయ‌న మూడేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయ‌న సన్నిహితుడు కావ‌డంతో ఆయన‌ను ఆ శాఖలో కొనసాగారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గతంలో ప్రభాకర్ రావుపై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు గుప్పించారు. ప్రతిపక్ష నేతలపై అనవసర నిఘా, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌రించారు. ఇక‌, ప్ర‌భుత్వ సలహాదారు కేవీ రమణాచారి కూడా రాజీనామా చేశారు. ఇప్ప‌టికే ట్రాన్స్‌కో, జెన్‌కో చైర్మ‌న్ దేవుల‌ప‌ల్లి ప్ర‌భాక‌ర్‌రావు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like