కేసీఆర్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్

YS Sharmila: తెలంగాణలో కేసీఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటించారు. వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, రాహుల్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని టెన్ జన్‌పథ్ రోడ్డులో సోనియా ఇంటికి వెళ్లిన షర్మిల వారితో సమావేశమయ్యారు. ఆమె వెంట భర్త అనిల్‌తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఆమె న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు నిరంతరం పనిచేస్తూనే ఉంటుందన్నారు. వైఎస్ బిడ్డగా తాను ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని ఆమె తెలిపారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే సోనియా, రాహుల్‌తో తాను చర్చించినట్లు చెప్పారు.

వైఎస్ ష‌ర్మిళ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారంటూ ప్రచారం జరుగుంతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌తో ఆమె పలుమార్లు భేటీ కూడా అయ్యారు. పార్టీ విలీనానికి సంబంధించే ఆయనతో షర్మిల భేటీ అయ్యారని డీకే.. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ప్రచారాన్ని షర్మిల ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేవీపీ రామమచంద్రరావు కూడా ఓ సందర్భంలో కీలక కామెంట్స్ చేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే అని.. ఆమెకు ఈ పార్టీతో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. త్వరలోనే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందని వ్యాఖ్యనించారు. ఇవాళ సోనియాగాంధీతో షర్మిల భేటీ వైఎస్ఆర్‌టీపీ విలీనంపై ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. అయితే తమ మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగినట్టుగా కూడ షర్మిల ప్రకటించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like