బ్యాంక్ మేనేజర్ కే సైబ‌ర్ వ‌ల‌… రూ. 2.25 ల‌క్ష‌లు స్వాహా

Telangana: త‌మ ఖాతాదారులు సైబ‌ర్ నేర‌గాళ్ల బారిన ప‌డ‌కుండా చూడాల్సిన ఓ బ్యాంక్ మేనేజ‌రే వారి బారిన ప‌డి డ‌బ్బులు పోగొట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో రూ. 2.25 ల‌క్ష‌లు స్వాహా కాగా బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

సైబ‌ర్ నేర‌గాళ్ల బారిన ఏం తెలియ‌ని అమాయ‌కులే కాదు… బాగా చ‌దువుకున్న వాళ్లు అది కూడా బ్యాంకింగ్ రంగంలో అనుభ‌వం ఉన్న వాళ్లు కూడా ప‌డుతున్నార‌టానికి ఈ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. హనుమకొండ జిల్లా పరకాలలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సకల్‌ దేవ్‌సింగ్‌ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయనకు ఓ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అందులో ‘మీ ఎస్‌బీఐ అకౌంట్‌ డీయాక్టివేట్ అవుతోంది. దయచేసి మేము పంపించిన లింక్ క్లిక్ చేసి మీ పాన్ కార్డు నెంబర్ ను అప్ డేట్ చేయండి’’ అని ఉంది.

పాన్ కార్డ్ అప్ డేట్ చేద్దామని ఆ మెసేజ్ పై రెండు సార్లు క్లిక్ చేశాడు. ఆ సమయంలో ఆయనకు మరో నెంబర్ నుంచి కాల్ వచ్చింది. పాన్ కార్డు అప్ డేట్ చేసేందుకు తాము మరో మేసేజ్ పంపించామని, దానిపై క్లిక్ చేస్తే అప్ డేట్ అవుతుందని అందులో ఓ వ్యక్తి చెప్పారు. తనకు వచ్చిన నెంబర్ కు మేనేజర్ కాల్ చేశారు. అవతలి వ్యక్తి మరో సారి వాట్సప్ కు ఓ లింక్ ను పంపించాడు. దానిని ఓపెన్ చేయగానే క్షణాల్లో అకౌంట్ లో నుంచి డబ్బులు మాయం అయ్యాయి. మొత్తం మూడు లావాదేవీల్లో రూ.2,24,967 అకౌంట్ నుంచి డెబిట్ అయ్యాయి. దీంతో మేనేజర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like