నిమిషం ఆలస్యమైనా అనుమతించం

కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్థులకు డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్

కానిస్టేబుళ్ళ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించమని నోడల్ ఆఫీసర్, డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఆదివారం (28న) పరీక్షలకు హాజరవుతున్న వారికి ఆయన పలు సూచనలు చేశారు. పరీక్ష ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంల వరకు నిర్వహిస్తారని తెలిపారు. అభ్యర్థులు ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రం చూసుకొని సరైన సమయానికి చేరుకునేలా రవాణా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

-అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగానే చేరుకోవాలి.

-ఉదయం 10:00 గం.ల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు. ఒక్క నిముషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోని అనుమతించరు.

-పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి బ్యాగులు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వాచ్ లు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకరాకుడదు.

-అభ్యర్థులు కేవలం టికెట్, పెన్ తో మాత్రమే పరీక్ష గదికి తీసుకురావాలి.

-అభ్యర్థులు తమ హాల్ టికెట్ పై పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అంటించుకొని రావాలి. లేకపోతే పరీక్షకు అనుమతించరు.

-హాల్ టికెట్ లో అన్ని వివరాలను సరి చూసుకోవాలి.

-హాల్ టికెట్ తో పాటు ఎటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ లు అక్కర్లేదు.

-పరీక్షకు బయోమెట్రిక్ అటెండెన్స్ (ఆధార్ వేలి ముద్రలు) తప్పనిసరి.

-ప్రాథమిక పరీక్షకు బయోమెట్రిక్ వేలిముద్రల హాజరు నమోదు చేస్తారు కాబట్టి మెహెందీ, టాటూలు పెట్టుకోవద్దు.

-పరీక్ష 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి ( ఏ.బి.సి.డి ప్రశ్నాపత్ర కోడ్ వేర్వేరుగా), 200 మార్కులు లి పరీక్షలో తప్పుగా గుర్తించిన సమాధానలకు నెగెటివ్ మార్కులుంటాయి.

-అభ్యర్థులు తమ రూమ్ నెంబర్, సంబంధిత సీట్ చేరుకొని ప్రశ్నాపత్ర కోడ్ ను పరిశీలించుకోవాలి.

-పరీక్ష వేళలు ముగిసేవరకు అభ్యర్థులు హాల్ లోనే ఉండాలి.

-పరీక్ష ముగిసిన తర్వాత అందరి ఒ.యం.ఆర్ కార్డ్ తీసుకున్నాక, అందరి బయోమెట్రిక్ అటెండెన్స్ పూర్తయ్యాకనే అభ్యర్థులను పరీక్ష గది నుండి ఒకేసారి బయటకి పంపిస్తారు.

-కోవిడ్ నిబంధనల మేరకు విద్యార్థులు మాస్క్ ధరించాలి.

-థర్మల్ స్క్రీనింగ్, సానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకున్నాకే కేంద్రంలోకి వెళ్ళాలి.

-అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వచ్చి పోయే సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ తమ గమ్య స్థానాలకు క్షేమంగా చేరుకోవాలని, అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోని.. రాత పరీక్షలో విజయం సాధించాలని అఖిల్ మహాజన్ అభ్యర్థులకు సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like