ప‌శువ‌ధ శాల ధ్వంసం.. ఉద్రిక్త‌త‌

Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప‌శువ‌ధశాలను సోమ‌వారం రాత్రి స్థానికులు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేష‌న్ త‌ర‌లించారు. అక్క‌డ ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… జిల్లా కేంద్రంలోని ఇందిర‌మ్మ కాల‌నీకి వెళ్లే దారిలో ప‌శువ‌ధ శాల‌ను ఎలాంటి అనుమ‌తులు లేకుండా కొన‌సాగిస్తున్నారు. దీనిపై గ‌తంలో రాష్ట్ర బీజేపీ నాయ‌కురాలు, మాజీ జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ సుహాసిని రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న చేప‌ట్టారు.

దీనికి స్పందించిన‌ మున్సిపల్ కమిషనర్, చైర్మన్ 45 రోజుల్లోగా అక్క‌డి నుంచి తరలిస్తామని హామీ ఇచ్చారు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్య చేపట్టక పోవడంతో ఇందిర‌మ్మ కాల‌నీ వాసులు సుహాసిని రెడ్డి ఆధ్వ‌ర్యంలో తిరిగి నిర‌స‌న చేప‌ట్టారు. కొంద‌రు కాల‌నీ వాసులు అక్క‌డ ఉన్న ప‌శువ‌ధశాల‌ను ధ్వంసం చేశారు. దీంతో వారిని పోలీసుల అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం అక్క‌డ ఉద్రిక‌త్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like