మూడు ఆలయాల ధ్వంసం

Komurambheem Asifabad: కొందరు దుండగులు వరుసగా ఆలయాలపై దాడులు చేస్తున్నారు. కేవలం రెండు రోజుల్లో మూడు దేవాలయాలపై దాడి చేసి విగ్రహాలు ధ్వంసం చేశారు.

కొమురంభీం జిల్లా బెజ్జూర్‌, చింతలమానేపల్లి మండలాల్లో రెండురోజు వ్యవధిలో మూడు ఆలయాలపై దాడులు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసిన కాల్చివేస్తున్నారు. శనివారం బెజ్జూర్‌ మండలంలోని అందుగులగూడ గ్రామ సమీపంలో మల్లన్న గుట్టపై శివమల్లన్న ఆలయం గుర్తుతెలియని దుండగులు గణపతి, నాగదేవత, శివలింగం నంది విగ్రహాలు ధ్వంసం చేశారు. వాటిని గర్బగుడిలో నుంచి తొలగించి పగులగొట్టి బయటపడేసి కనిపించాయి. అదే రాత్రి చింతలమానేపల్లి మండలంలోని‌ కర్జెల్లి గ్రామ శివారులో ఉన్న ముసలమ్మ గుట్టపైన ఉన్న శివాలయంలో శివలింగం, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేశారు. అయితే గుప్తనిధుల కోసం మేనని గ్రామస్థులు భావించారు.

ఆదివారం చింతలమానేపల్లి మండలం కేంద్రంలోని చిలుకల‌ భీమన్న ఆలయాన్ని సైతం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగల బెట్టారు. ఇది ఒకరిద్దరి పనికాదని 10 మంది వరకు వచ్చి ఉంటారని భావిస్తున్నారు. దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like