ముఖ్య‌మంత్రి మంచిర్యాల ప‌ర్య‌ట‌న వివరాలు ఇవే..

CM KCR: ముఖ్య‌మంత్రి కేసీఆర్ రేపు (శుక్ర‌వారం) మంచిర్యాల జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న హెలికాప్ట‌ర్ ద్వారా మంచిర్యాల జిల్లా చేరుకుంటారు. ఆయ‌న సాయంత్రం 4 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకుంటారు. 5 గంట‌ల‌కు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వ‌ద్ద‌కు చేరుకుంటారు. 5.10 నిమిషాల‌కు బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యాల‌యం ప్రారంభిస్తారు. 5.15 నిమిషాల‌కు బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం నుంచి బ‌య‌ల్దేరి 5.30కు స‌మీకృత జిల్లా క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని ప్రారంభించ‌నున్నారు. అక్క‌డి నుంచి 6.30కి బ‌హిరంగ స‌భాస్థ‌లికి చేరుకుంటారు. అక్క‌డ ప్ర‌జ‌లు, పార్టీ శ్రేణుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. 7.30కి రోడ్డు మార్గం ద్వారా తిరిగి హైద‌రాబాద్ బ‌య‌ల్దేరి వెళ‌తారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like