ధోని రికార్డు బ్రేక్ చేయ‌నున్న హిట్‌మ్యాన్

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా బుధవారం సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు బరిలోకి దిగనుంది. తొలిసారి కెప్టెన్‌గా వచ్చిన రోహిత్‌కి ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. జట్టు విజయంతో పాటు రోహిత్ చూపు ప్రత్యేక రికార్డుపైనే నిలిచింది. భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి వన్డేలో రోహిత్ సిక్సర్ కొట్టాడు. దీంతో హిట్‌మ్యాన్ స్వదేశంలో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ధోని రికార్డును సమం చేశాడు. భారత గడ్డపై ఇప్పటి వరకు రోహిత్, ధోనీలు 116 సిక్సర్లు కొట్టారు. భారత్‌లో ఆడిన 113 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ధోనీ 116 సిక్సర్లు బాదగా, రోహిత్ 68 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డును నెలకొల్పాడు. నేటి మ్యాచులో ఒక్క సిక్సర్ కొట్టగానే ధోనీని దాటి ముందుకు వెళ్తాడు. స్వదేశంలో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ ప్రస్తుతం ప్రపంచ ఐదో ర్యాంక్‌లో ఉన్నాడు. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ సొంతగడ్డపై 147 సిక్సర్లు బాదాడు. అతని తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ (130), బ్రెండన్ మెకల్లమ్ (126), ఇంగ్లండ్‌కు చెందిన ఇయాన్ మోర్గాన్ (119) ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like