బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి అదృశ్యం

Basara: బాస‌ర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి అదృశ్యం అవ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇంటికి అని వెళ్లిన విద్యార్థి మూడు రోజులుగా ఇల్లు చేర‌క‌పోవ‌డంతో పాటు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వ‌స్తోందని ఆ విద్యార్థి త‌ల్లిదండ్రులు చెబుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. మెద‌క్ జిల్లా తూప్రాన్ మండ‌లం న‌ర్సంప‌ల్లికి చెందిన బ‌న్నీబాబు అనే విద్యార్థి బాస‌ర ట్రిపుల్ ఐటీలో రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. మూడు రోజులుగా బ‌న్నీ ఫోన్ స్విచ్ఛాప్ వ‌స్తుండ‌టంతో అనుమానించిన త‌ల్లిదండ్రులు మిగ‌తా వారికి ఫోన్ చేయ‌డంతో అత‌ను మూడు రోజుల కింద‌ట ట్రిపుల్ ఐటీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన‌ట్లు చెబుతున్నారు. గురువారం ఉదయం హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లినట్లు యాజమాన్యం స్ప‌ష్టం చేసింది. ఔట్ పాస్ సైతం తీసుకొని వెళ్లాడు. అయితే, అత‌ను ఇంటికి రాక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తమ అనుమతి లేకుండా పిల్ల‌ల‌ను బయటకు ఎలా పంపుతారని కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. బన్నీ కనిపించడం లేదని మెద‌క్ జిల్లాలో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ విద్యార్థి త‌ల్లిదండ్రులు బాస‌ర బ‌య‌ల్దేరి వెళ్లారు. బన్నీ బాబు ఫోన్ మహారాష్ట్ర లో ట్రాక్ అవుతున్న‌ట్లు స‌మాచారం. అక్క‌డ ఎవ‌రైనా ఉన్నార‌ని వెళ్లాడా…? లేక ఇంకేదైనా కార‌ణం ఉందా..? అనేది తెలియ‌రాలేదు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like