బిగ్ బ్రేకింగ్‌.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఎంపీగా రాహుల్ గాంధీ చెల్లుబాటు కారని లోక్ సభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంటి పేరు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్ స‌భ సెక్ర‌టేరియేట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీంతో ఆయ‌న ప‌డింది. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలినందున లోక్‭సభకు అనర్హుడయ్యాడు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేశారు. ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్‭సభ సెక్రెటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

“కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం దోషిగా తేలినందున, 23 మార్చి 2023 నుంచి లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాడు. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం చర్యలు తీసుకోబడ్డాయ”ని లోక్‌సభ సెక్రటేరియట్ ఈరోజు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like