జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ..

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌న్న మంత్రి తలసాని

Battina brothers: జూన్ 9న మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదాన్ని బత్తిన సోదరులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉచితంగా పంపిణీ చేయనున్నారు. క‌రోనా వల్ల మూడేళ్లుగా చేప ప్రసాదాన్ని నిలిపివేశారు.. మళ్లీ ఈ ఏడాది నుంచి చేప మందును పంపిణీ చేస్తామని బ‌త్తిన సోద‌రులు వెల్ల‌డించారు. బత్తిన కుటుంబం 60 సంవత్సరాలుగా చేప ప్రసాదం పంపిణీ చేస్తోంది. చేప ప్రసాదానికి ఉబ్బసం వ్యాధిగ్రస్తులు తెలంగాణ నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా లక్షలాదిగా తరలి వస్తారు. బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదం కోసం జనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతారు. కరోనా తర్వాత తొలిసారి చేప ప్రసాదం పంపిణీ కావడంతో ఈసారి జనం భారీగా తరలిరానున్నారని అంచనా వేస్తున్నారు.

ప్రసాదం కోసం వచ్చేవారు నాలుగు గంటల ముందు నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకూడదని నిర్వాహ‌కులు సూచించారు. ప్రసాదం తీసుకున్న అనంతరం రెండు గంటల పాటు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవద్దని తెలిపారు. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా అస్తమా బాధితులకు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు బత్తిన సోదరలు. చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ప‌ష్టం చేశారు.

250 మంది బత్తిని కుటుంబ సభ్యులు, వాలంటీర్‌లు పని చేస్తున్నారన్నారని మంత్రి తలసాని అన్నారు. చేపప్రసాదం ఇంటికి తీసుకెళ్లడానికి కార్తీ కౌంటర్లు కూడా పెంచినట్లు వెల్లడించారు. గోషామహల్ ప్రజలు సహకరించాలని కోరారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులు, నాంపల్లి నుంచి రైల్వే సర్వీసులు అందుబాటులో ఉంటాయని మంత్రి వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like