న్యూట్రిష‌న్ కిట్ల పంపిణీ

ప్రధానమంత్రి TB ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ ఎంపీ , హెటీరో సంస్థ అధినేత డాక్టర్ బండి పార్థసారధి రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా క్షయ వ్యాధిగ్రస్తులకి న్యూట్రిషన్ కిట్ల‌ని TB పేషెంట్లకు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ప్రజలంతా క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి సక్రమంగా సకాలంలో మందులు వాడి మందులతో పాటు బలమైన ఆహారం కూడా తీసుకోవాలని సూచించారు. 2025 క్షయవ్యాధి రహిత భారత దేశంగా ఆవిష్కృతం అవ్వాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అందుకే హెటిరో ఫౌండేషన్ వారి తరఫున వ్యాధిగ్రస్తులకు బలమైన ఆహారం తీసుకునేందుకే కిట్టుని అందజేస్తున్నానని తెలిపారు. క్షయ వ్యాధిగ్రస్తుల కి న్యూట్రిషన్ కిట్ అందజేసినందుకు బండి పార్థసారధి రెడ్డికి మధిర TB యూనిట్ తరపునుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్లు అనిల్, వెంకటేశ్వర్లు, వెంకటేష్, పృద్వి, శ్రీనివాస్, N.సందీప్, శివ, రమాదేవి, మనోహర, శైలజ, రాజు, సుబ్బలక్ష్మి, ఫైమూన్, కొండయ్య, భాస్కర్ రావు,వెంకటేశ్వర్లు ఫైమోన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like