అభివృద్ధి య‌జ్ఞం చేస్తున్నం

-60 ఏండ్ల‌లో ఏ నాయ‌కుడు ప‌ట్టించుకోలే
-అభివృద్ధి చేయ‌కుండా మిమ్మ‌ల్ని అడ్డుకున్న‌ది ఎవ‌రు..?
-ఎంపీగా వివేక్ ఈ నియోజ‌క‌వ‌ర్గానికి చేసింది ఏమిటి..?
-విపక్ష నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నరు
-కేసీఆర్‌ను మాన‌సికంగా వేధించే ప్ర‌య‌త్నాలు సాగుతున్నయి
-అందుకే క‌విత‌పై కేసులు పెడుతున్న‌రు
-ప్ర‌భుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌

Balka Suman: చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి యజ్ఞం చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. చెన్నూరులో రూ. 204 కోట్ల‌తో ప‌లు అభివృద్ది ప‌నుల‌కు మంత్రి హ‌రీష్‌రావు శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో సుమ‌న్ మాట్లాడారు. గడిచిన 60 ఏండ్ల‌లో చెన్నూరు నియోజకవర్గాన్ని ఏ నాయకుడు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దశాబ్దాలుగా అభివృద్ధి, సంక్షేమం అందక దారుణ పరిస్థితి ఏర్పడ్డాయన్నారు. నియోజకవర్గాన్ని 30 ఏళ్లు, కాంగ్రెస్ 20 ఏళ్లు టీడీపీ, బీజేపీ పాలించినా ఎంతో వెనుకబాటుకు గురైందన్నారు.

ఇంత గొప్పగా చెన్నూరు అభివృద్ధి యజ్ఞం కొనసాగుతుంటే దమ్ము లేక విపక్ష నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని బాల్క సుమ‌న్ దుయ్య‌బ‌ట్టారు. 1952 నుంచి చెన్నూరు నియోజకవర్గంలో గెలిచిన నాయకులందరూ ఇక్కడ ప్రజలు అమాయకత్వంతో గెలిచార‌ని అన్నారు. అడ్డగోలుగా ఆరోపించే విపక్ష నాయకులు 50 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని..? ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. అధికారంలో ఉండి కూడా అభివృద్ధి చేయకుండా మిమ్మల్ని అడ్డుకున్నది ఎవరని దుయ్య‌బ‌టారు. చెన్నూరు నియోజకవర్గానికి తాగునీరు, సాగునీరు ఎందుకు తీసుకురాలేద‌న్నారు.

కేంద్రంలోని మోడీ సహకరించక పోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో చెన్నూరు అభివృద్ధి యజ్ఞం కొనసాగుతోంద‌న్నారు. మిషన్ భగీరథ కోసమే రూ. 160 కోట్లు ఖర్చు పెడుతున్నామ‌న్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ. 1600 కోట్లతో చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. మంత్రిగా వినోద్ ఉన్నప్పుడే సింగరేణి బొగ్గు బాగులు మూతపడ్డాయ‌న్నది వాస్తవం కాదా..? అని ప్ర‌శ్నించారు. 2014-19 వరకు ఎంపీగా ఉన్న వివేక్ ఈ నియోజకవర్గానికి చేసింది ఏమిటన్నారు. 1952 నుండి వెంకటస్వామి గెలుపుతో ఈ నియోజకవర్గంలో వాళ్ళ అరాచకం మొదలయ్యిందన్నారు. వేరే రాష్ట్రాల్లో ఆస్తులు, అంతస్తులు, ఫ్యాక్టరీలు సంపాదించుకొని కోట్లకు పడగలెత్తారని దుయ్య‌ట్టారు.

చెన్నూరు పట్టణంలో అంతర్గత రోడ్లు, కాలువల నిర్మాణానికి అదనంగా 25 కోట్లు మంజూరు చేయాలని స‌భ‌లో మంత్రి హరీష్‌రావుని కోరారు. గాంధీచౌక్ వద్ద నిర్మిస్తున్న దవాఖాన మాతా శిశు ఆసుపత్రిగా మార్చాలని విజ్ఞ‌ప్తి చేశారు. రామకృష్ణాపూర్,చెన్నూర్,భీమారంలో PHC సెంటర్లను ఏర్పాటు చేయాలని, పారుపల్లి, ఆస్నాద్ కొత్త మండలాలుగా, చెన్నూరు రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, వృద్ధిరేటులో దూసుకుపోతుందని తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలనే లక్ష్యంతోనే మా నాయకులపై IT, ED, CBI దాడులు చేస్తున్నారని అన్నారు. బీజేపీ కేసులకి భయపడేది లేదన్నారు. కేసీఆర్‌ని మానసికంగా వేధించే కుట్రలో భాగంగానే కవితపై ఈడి కేసుల కుట్రలు చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంబానీ ఆదానీలకు వంతపడుతున్న మోడీ ఎయిర్పోర్ట్, బొగ్గు స్కాములు అనేక స్కాములు చేస్తున్నాని అన్నారు. బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మొస్త‌డు.. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నడని, ఒకరు బ్రోకర్, ఒకరు బ్లాక్ మెయిలర్ అని దుయ్య‌బ‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ రేణికుంట్ల ప్ర‌వీణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like