శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం..

తుదిశ్వాస వరకూ స్వామి సేవలోనే

తిరుమల శ్రీవారి ఆలయ ఓయస్డీ డాలర్ శేషాద్రి హఠన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన డాలర్ శేషాద్రి సోమవారం తెల్లవారుజామున గుండపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే లోపు కన్నుమూశారు. 1978 నుంచి శ్రీవారి సేవలో తరిస్తున్న డాలర్ శేషాద్రి.. 2007లో పదవీవిరమణ చేశారు. అయితే, శేషాద్రి సేవలు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి తప్పనిసరి కావడంతో ఓయస్డీగా కొనసాగించారు.డాలర్ శేషాద్రి తుది శ్వాస వరకూ స్వామి సేవలో తరించారు. డాలర్‌ శేషాద్రి మరణం టీటీడీకి తీరని నష్టమని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేనిదని చెప్పారు. టీటీడీ అధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద కార్తిక మహా దీపోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయగా అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like