పార్టీకి న‌ష్టం చేస్తే ఉపేక్షించం

-కొంద‌రు నేత‌లు అమ్ముడు పోయి అయోమ‌యం సృష్టిస్తున్నారు
-మొద‌టి నుంచి ప‌ని చేసే వారికే పార్టీలో న్యాయం
-మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

Congress: కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే వారిని ఉపేక్షించబోమని మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కోక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని త‌న నివాసంలో జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సురేఖ‌తో క‌లిసి ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. మంచిర్యాల జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంద‌న్నారు. మీడియాతో పాటు, పలు సర్వేలు చెబుతున్నాయని ప్రేంసాగ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే వస్తాయన్నారు. గడిచిన రెండు నెలల నుండి జిల్లాకు సంబంధం లేని నాయకులు, వారి అనుచరులు కొంతమంది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కోవర్టు రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్య‌బ‌ట్టారు.

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు అమ్ముడుపోయి ప్రజల్లో, కార్యకర్తల్లో పార్టీ పట్ల నమ్మకం తగ్గేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని, కార్యకర్తలను పట్టించుకోని నాయకులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డబ్బు సంచులతో వచ్చి పోటీచేయాలని కుట్రలకు పాల్పడుతున్నారన్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చెన్నూరు, బెల్లంపల్లిలో పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్న నాయకులు ఉన్నా కొత్తగా కొంతమంది తమకే టికెట్టు వస్తుందని ప్రచారం చేసుకుంటూ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు.

మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు న్యాయం చేసే బాధ్యత తమపై ఉందని ప్రేంసాగ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. బెల్లంపల్లిలో చిలుముల శంకర్, చెన్నూరులో నూకల రమేష్, బోథ్లో డాక్టర్ వన్నెల అశోక్, ఆసిఫాబాద్లో డాక్టర్ గణేష్ రాథోడ్ మొదటి నుంచి పార్టీ కోసం కట్టుబడి కష్టాలకు ఓర్చి పని చేస్తున్నారన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విజయవంతం అయ్యేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. అలాంటి వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like