ఈ-చలాన్ సర్వర్ డౌన్

తెలంగాణ వ్యాప్తంగా సుదీర్గకాలంగా పెండింగ్ లో ఉన్న చ‌లాన్ల క్లియ‌రెన్స్ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది. గరిష్టంగా 75 శాతం డిస్కౌట్ ప్రకటించడంతో చలాన్ల చెల్లింపునకు తొలి రోజు నుంచే వాహ‌నాదారులు పోటెత్తారు. ప్రతి నిమిషానికి 700 చోప్పున క్లియరెన్సులు కాగా, ప్రభుత్వానికి గంటల వ్యవధిలోనే కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అయితే ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతో ఈ-చలాన్ సర్వర్ కుప్పకూలింది. వెబ్ సైట్ క్రాష్ కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

తెలంగాణ పోలీసులు మార్చి 1 నుంచి 30వ తేదీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తొలిరోజే ఊహించని రీతిలో విశేష స్పందన లభించింది. ఉదయం నుంచే వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వాహనదారులు తమ వాహనం పేరిట ఉన్న చలానాలను చెల్లిస్తున్నారు. ఇందుకోసం పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే, నెట్‌బ్యాంకింగ్‌లతో పాటు మీసేవ/ఈసేవ కేంద్రాల్లోనూ జరిమానాలు చెల్లించేందుకు పోలీసులు అనుమతించారు. అయితే ఒకే సమయంలో వేలాది మంది వాహనదారులు చెల్లింపునకు ప్రయత్నిస్తుండటంతో వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. పేమెంట్‌ గేట్‌ వే వద్ద ఎక్కువగా సమస్య వస్తుందని వాహనదారులు వాపోతున్నారు.

పెండింగ్ ఈ చ‌లాన్ల చెల్లింపుల ద్వారా కేవలం 8 గంటల్లోనే సర్కారువారికి రూ. 1.77 కోట్లు జ‌మ అయ్యాయి.

ఈ చలాన్ల వెబ్‌సైట్‌ https://echallan.tspolice.gov.in/publicview/ లో ప్రత్యేక లింక్ ద్వారా ఈజీగా క్లియరెన్సులు చేసుకోవచ్చు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like