కౌశిక్ రెడ్డి కామెంట్లపై ఈసీ సీరియస్..

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం చివరి రోజు మంగ‌ళ‌వారం తన భార్య, కూతురుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓ చోట నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మీకు దండం పెడతా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. నాకు ఓటేసి నన్ను గెలిపించండి.. నేను చేయాల్సిన ప్రచారం చేసిన.. ఇక నన్ను సాదుకుంటరో, సంపుకుంటరో మీ ఇష్టం.. నన్ను, నా భార్య, నా బిడ్డను సాదుకుంటారో.. ఓడించి ఉరేసుకొమ్మంటారో మీ చేతుల్లోనే ఉంది. ఓట్లేసి గెలిపిస్తే డిసెంబర్ 3న విజయ యాత్రకు నేను వస్తా.. లేకపోతే డిసెంబర్ నాలుగో తారీఖు నా శవయాత్రకు మీరు రండంటూ కౌశిక్ రెడ్డి అన్నారు.

కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్‌ ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. భావోద్వేగ వ్యాఖ్యల నేపథ్యంలో ఈసీ నివేదిక కోరింది. కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. స్థానిక రిటర్నింగ్ అధికారికి వివరణ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like