బాలికల చదువు దేశానికి ఎంతో ఉపయోగం

క‌రీంన‌గ‌ర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

Karminagar: దేశ అభివృద్దిలో విద్య ఎంతో ప్రధానమని, అందులో బాలికల చదువు దేశానికి ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కోరమాండల్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ బాలికలు ప్రతిభా పురస్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాలికల చదువు దేశానికి ఎంతో ఉపయోగం అని దీన్ని ప్రోత్సహిస్తున్న కోరమండల్ కంపెనీకి అభినందనలు తెలిపారు. లింగ వివక్ష లేకుండా తల్లిదండ్రులు బాలికల విద్యను ప్రోత్సహించాల‌న్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులలో మొదటి ర్యాంకు సాధించిన వారికి రూ. 5 వేలు, రెండవ ర్యాంకు సాధించిన‌ విద్యార్థినులకు రూ. 3 వేల నగదు ప్రోత్సహకాలను అందించారు. మారుముల ప్రాంతాల విద్యార్థినులకు విద్య ఎంతో అవసరమని, పరీక్షలలో ఉతీర్ణత సాధించలేదని నిరుత్సాహ పడి ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పకూడదని, మరోసారి ప్రయత్నించి అనుకున్న విజయాన్ని సాధించాలని తెలిపారు.

కంపెనీ సీనియర్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కోరమాండల్ సంస్థ గ్రామీణ బాలికలు ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలలో నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రతి జిల్లా నుంచి వంద మంది జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్న బాలికలను ఎంచుకుని వారికి ప్రతిభ ఆధారంగా ఆ స్కాలర్షిప్ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, విద్యా శాఖ అధికారి జనార్దన్ రావు, కోరమండల్ సంస్థ జోనల్ మేనేజర్ సజన్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, డివిజనల్ ఆర్గానమిస్ట్ సుధాకర్ రెడ్డి, కోర‌మాండ‌ల్ కంపెనీ ప్రతినిధులు రాజేష్, సుమన్ రెడ్డి, అనిల్ రెడ్డి, నరేష్ శర్మ, జగన్,సురేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like