ఈ మాస్క్ క‌రోనాను గుర్తిస్తుంది

సహజంగా తీవ్రమైన జ్వరం జలుబు దగ్గు.. ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు చేయించుకుంటారు. లేదంటే ఇతర దేశీయ విదేశీ ప్రయాణాలు చేసేవారికి వైరస్ నిర్ధరణ పరీక్షలు చేస్తారు. అందుకోసం ఆర్టీపీసీఆర్ వంటి టెస్టులు చేస్తారు. అయితే వీటికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఏదైనా విదేశీ ప్రయాణం చేయాలంటే విమానం ఎక్కేముందు ప్రతీసారి కొవిడ్ టెస్టు చేయించుకోవాలి. అలా చూసుకుంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకే ఓ శాస్త్రవేత్తల బృందం ఏకంగా మాస్క్… కరోనాను గుర్తించేలా పరిశోధనలు చేశారు.

ఈ మాస్క్ జపాన్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఆ దేశానికి చెందిన క్యోటో ప్రీ పెక్చువల్ యూనివర్శిటీ సైంటిస్టుల టీమ్ దీనిపై పరిశోధనలు చేసింది. ఈ బృందానికి యసుహీరో త్సకుమాటో నేతృత్వం వహించారు. వీరు రూపొందించిన మాస్కుకు నిప్పుకోడి యాంటీబాడీలను పూశారు. వాటిని మాస్క్ లేయర్లపై పలుచగా పూస్తారు. అవి కరోనాను గుర్తించగలుగుతాయట.

వైరస్ సోకిన వ్యక్తి ఈ మాస్కును ధరిస్తే… వెంటనే ఆ మాస్క్ లేయర్లు మెరుస్తాయి. ఈ విధంగా వైరస్ ను మెరిపించే శక్తి ఆ మాస్కులో ఉంటుంది. తొలుత దీనిని వైరస్ నుంచి కాపాడుకోవడానికే తయారు చేశామని ఆ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ తర్వాత కొన్ని ప్రయోగాలు చేసి… కరోనా ఉందో.. లేదో తెలుసుకునేలా రూపొందించామని వెల్లడించారు. ఈ విధంగా వ్యక్తి తనకు వైరస్ సోకిందా? లేదా అనేది ఏ ఆస్పత్రికి వెళ్లకుండా తెలుసుకోవచ్చునని వారు చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like