సింగ‌రేణిలో ఎన్నిక‌ల సైర‌న్‌

హుజురాబాద్ పోరు ముగిసిన వెంట‌నే గుర్తింపు ఎన్నిక‌లు - న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌లో నిర్వ‌హించే అవ‌కాశం - తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో సిద్ధ‌మ‌వుతున్న కార్మిక సంఘాలు

సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల వేడి అంతకంతకు రాజుకుంటోంది. ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న అంచనాతో కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. దీంతో ఎన్నికల్లో గెలుపుకోసం అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.

సింగరేణిలో గుర్తిం పు సంఘం ఎన్నికల సందడి ప్రారంభ మైంది. ఇప్పటి వరకు గుర్తింపు సంఘంగా బాధ్యతలు నిర్వహించిన టీబీజీకేఎస్‌ కాల పరిమితి ముగిసి దాదాపు ప‌ది నెలలు కావస్తుండడంతో ఎన్నికల నిర్వహణ అనివార్యం అయింది. సింగరేణి సంస్థలో 1990 నుంచి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రెండేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించే వారు. 1998, 2000 సంవత్స రాల వరకు జరిగిన ఎన్నికలకు కూడా కాల పరిమితి రెండేళ్లు ఉండేది. 2003లో గుర్తింపు సంఘం కాల పరిమితి నాలుగే ళ్లకు పెంచారు. 2013 వరకు కూడా అదే పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. కాగా 2017 అక్టోబర్‌ 5న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాల పరిమితి తిరిగి రెండేళ్లకు కుదించా రు. గుర్తింపు సంఘం కాల పరిమితి ముగిసి దాదాపు ప‌ది నెలలు కావస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహణకు కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి.

ఎన్నిక‌ల కోసం కార్మిక సంఘాల పట్టు..

ఐదు జాతీయ కార్మిక సంఘాలైన ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌, బీఎంఎస్‌ తోపాటు ప్రాంతీయ సంఘాలు కూడా ఎన్నికల నిర్వహణకు పట్టుబడుతు న్నాయి. ఎన్నికలు నిర్వ హించాలని డిమాండ్‌ చేస్తూ కేంద్ర కార్మికశాఖ మంత్రితోపాటు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారి హీరాలాల్‌ సమారియాకు హైదరాబాద్‌లో ప్రధాన సంఘాల ఆధ్వర్యంలో విన తి పత్రాలు సమర్పించారు. స్పందించిన కార్మికశాఖ యూనియన్ల వారీగా వార్షిక నివేదిక సమర్పించా లని కోరింది. ఈ మేరకు కార్మిక సంఘాలు వార్షిక నివేదికలతో పాటు రిజిస్ట్రిషేన్‌ ధ్రువీకరణ పత్రాలు, డిక్లరేషన్‌లు, తదితర వివరా లను ఇప్పటికే కార్మికశాఖకు అందజేశాయి. మ‌రోవైపు గురువారం ఆర్ ఎల్‌సీని క‌లిసిన కార్మిక సంఘ నేత‌లు చ‌ర్చ‌ల్లో త‌మ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరారు.

నవంబర్ లేదా డిసెంబ‌ర్‌లో ఎన్నికలు?

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను కార్మికశాఖ నవంబర్ చివ‌రి వారం లేదా డిసెంబ‌ర్ లో నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుర్తింపు సంఘం కాల పరిమితి ముగిసి నెలలు గడుస్తున్నప్పటికీ కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించ లేదు. దీంతో ఇంతకాలం కార్మికశాఖ ఆ ప్రక్రియ చేపట్టలేదు. ప్ర‌స్తుతం క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టిన నేప‌థ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఇబ్బందులు ఉండ‌వ‌ని కార్మిక శాఖ భావిస్తోంది. ప్రధాన కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించిన అనంతరం ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. సెంట్రల్‌ లేబర్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌ (ఆర్‌ఎల్‌సీ) కార్మిక సంఘాలకు లేఖలు రాసింది. మ‌రోవైపు హుజురాబాద్ ఎన్నిక‌లు సైతం ముగుస్తుండ‌టంతో ప్ర‌భుత్వం సైతం సింగ‌రేణి ఎన్నిక‌ల‌కు సై అనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like