ఎంపీడీవో కారులో ఓట‌ర్లు…

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో చిత్ర‌మిది..

ఆదిలాబాద్ – ఉమ్మ‌డి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప‌లు చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా ముగిసినా ఎన్నో మ‌లుపులు తిరిగాయి. ఇదంతా ఒక్కెత్తు కాగా ఏకంగా ఓట‌ర్ల‌ను ఒక ఎంపీడీవో త‌న కారులో త‌ర‌లించి నిబంధ‌న‌లు ఉల్లంఘించారు. ఎంపిడీఓ కారులో ఓటర్లను తరలించారు. బేల మండ‌లానికి సంబందించిన ప్రజాప్రతినిధులు ఓటు వేసేందుకు అధికారి వాహనంలో రావడం వివాదాస్పదమైంది..ఓటు వేసిన ప్రజాప్రతినిధులు అదే వాహనంలో వెళ్లిపోయారు.. టిఎస్ 01 ఈకే 4171 అనే నంబర్ గల కార్ లో బేల మండ‌లం నుంచి వచ్చారు. అది ఎంపీడీవో కారు కావ‌డంతో ప్ర‌తిప‌క్ష నేత‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ అధికారి వాహానంలో ఓటర్లను తరలింపుపై ప్రతిపక్షాల ఆగ్రహం వ్య‌క్తం చేశారు. అయితే, అది ఎంపీపీ కార‌ని డ్రైవ‌ర్ బుకాయించే ప్ర‌య‌త్నం చేశారు. దానిని మీడియా కవరేజ్ చేస్తున్న క్రమంలో టిఆర్ఎస్ పార్టీ కి చెందిన ఎంపిటీసీ ఒక‌రు దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. ఆ త‌ర్వాత చాలా మంది నేత‌లు వ‌చ్చి న్యూస్ క‌వ‌ర్ చేయ‌వ‌ద్ద‌ని కోరారు. మ‌రి దీనిపై క‌లెక్ట‌ర్‌, ఎన్నిక‌ల సంఘం ఏ విధంగా స్పందింస్తుందో చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like