బెల్లంపల్లి ఏరియాలో ఉద్యోగులను నియమించాలి

Bellampally Area : బెల్లంపల్లి ఏరియాలోని గనులు, డిపార్ట్మెంటుల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉందని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస్‌ రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనితో ఉత్పత్తి, రక్షణకు విఘాతం కలుగుతోంద‌న్నారు. వెంటనే కార్మికులను బదిలీపై నియమించాలని జీఎం జి దేవేందర్ ని కోరారు. బుధవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ నేత‌లు జీఎంను క‌లిసి కార్మికుల కొరత గురించి వివరించారు. ముఖ్యంగా ఏరియా వర్క్ షాప్ కైరిగూడ ,స్టోర్, సీహెచ్‌పీలలో కార్మికుల కొరత తీవ్రంగా ఉన్నదన్నారు. వెంటనే కార్మికుల నియమించడానికి కావాల్సిన‌ చర్యలు తీసుకోవాలని కో రారు.

బెల్లంపల్లి ఏరియాలో మహిళా కార్మికులను కూడా ప‌ర్మనెంట్ జనరల్ మజ్దుర్ కింద లెక్క తీసుకుంటున్నార‌ని వెల్ల‌డించారు. దీనివ‌ల్ల ఇబ్బంది కలుగుతున్నదని శ్రీనివాస్‌ రావు అన్నారు. జనరల్ మజ్దూర్ కార్మికులు 50 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉండడం వలన వారు పనిచేయలేకపోతున్నారని వెల్ల‌డించారు. వెంటనే యువ కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం అధికారుల దృష్టికి తీసుకువచ్చి కార్మికుల కొరతను నివారించడానికి కృషి చేస్తానని జనరల్ మేనేజర్ దేవేందర్ హామీ ఇచ్చినట్టు యూనియన్ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రకాశరావు, 11 మెన్ కమిటీ మెంబర్ మంగీలాల్, జీఎం కమిటీ మెంబర్లు కోగిలాల రవీందర్, మంతు సమ్మయ్య, ఏరియా నాయకులు అలవేణి సంపత్ ఫిట్ కార్యదర్శిలు ముల్కల చంద్రయ్య, పూర శ్రీనివాస్,మెరుగు రమేష్, ఓరం కిరణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like