మహారాష్ట్రలో ఎన్ కౌంటర్

-ఒక మావోయిస్ట్ మృతి
-భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

Encounter in Maharashtra: మహారాష్ట్రలోనీ గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్ట్ మృతి చెందారు. ఈ ఘటనలో పోలిసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోలి జిల్లా మౌజా తోడఘట్ట వద్ద నక్సలైట్లు భారీ మెరుపుదాడికి ప్లాన్ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక జవాన్లు, గడ్చిరోలి పోలీసులు శనివారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఉదయం 10:00 గంటల ప్రాంతంలో అటవీ ప్రాంతంలోని కొండపై 60 నుండి 70 మంది నక్సలైట్లు BGL, ఇతర ఆయుధాలతో కాల్పులు జరిపారు. దాదాపు 30 నుంచి 45 నిమిషాల పాటు ఈ ఎన్‌కౌంటర్ కొనసాగింది. అనంతరం నక్సలైట్లు అడవిలోకి పారిపోయారు.

ఎన్‌కౌంటర్ తర్వాత, జవాన్లు అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా, ఘటనా స్థలంలో ఒక మావోయిస్ట్ మృతదేహం లభ్యమయ్యింది. మరణించిన నక్సల్‌ను సమీర్ అలియాస్ సాధు లింగ మోహన్దా(31)గా గుర్తించారు. అతనిపై 4 కేసులు నమోదయ్యాయనీ పోలిసులు తెలిపారు. 2018 లో పోస్టే భామ్రాగర్‌లో పోలీసులపై మెరుపుదాడి చేసినందుకు కేసు కూడా నమోదైంది. ఈ ఘటనలో కంట్రీ మేడ్ రైఫిల్, భర్మార్ రైఫిల్, 1 303 రైఫిల్, పేలుడు పదార్థాలు, 2 మ్యాగజైన్‌లు, 30 రౌండ్ల SLR రౌండ్లు, 8 ఎం.ఎం. 3 రౌండ్లు రైఫిల్, 12 బోర్ 4 రౌండ్లు,శాంసంగ్ కంపెనీ ట్యాబ్లెట్, రేడియో, నగదు స్వాధీనం చేసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like