మాట‌ల తూటాలు పేల్చిన ఈటెల

కేసీఆర్ ప్ర‌భుత్వం కొన‌సాగ‌డం స‌మాజానికి అరిష్టం - గొంతెత్తిన ప్ర‌తీ ఒక్క‌రినీ ఖ‌తం చేస్తున్న‌రు - యుద్ధం మొద‌లైంద‌ని ఆగ్ర‌హం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయాల‌ను సైతం బిజినెస్‌గా మార్చార‌ని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న శుక్ర‌వారం శామీర్‌పేట‌లో ఆయ‌న నివాసంలో హుజూరాబాద్‌కు చెందిన కుల సంఘాల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఈటెల మాట‌ల తూటాల‌ను పేల్చారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా డ‌బ్బు ఖ‌ర్చు చేశార‌ని అన్నారు. ఓట‌ర్ల‌కు డ‌బ్బుల ఇచ్చి కుల దేవ‌త‌లు, ప‌సుపు, కుంకుమ మీద ప్ర‌మాణం చేయించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గొంతెత్తిన ప్ర‌తి ఒక్క‌రినీ ఖ‌తం చేస్తున్నార‌ని చెప్పారు. కేసీఆర్ ప్ర‌భుత్వం కొన‌సాగడం స‌మాజానికి అరిష్ట‌మ‌ని స్ప‌ష్టం చేశారు. తోక మీద కొట్టి ఒదిలిపెట్ట‌వ‌ద్ద‌న్నారు. ప్ర‌జ‌లు ఇక‌నైనా సీరియ‌స్‌గా స్పందించాల‌ని ఆయ‌న విజ్ఙ‌ప్తి చేశారు. అస‌లు యుద్ధం ఇప్పుడే మొద‌లైంద‌న్నారు. త‌న‌ను ప్ర‌జ‌ల‌కు ఆయుధంగా కేసీఆర్ అందించార‌ని చెబుతున్నార‌ని చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like