చిన్నారులను చూసినా… కాల్చేశారు..

ఆరుగురి స‌జీవ ద‌హ‌నం కేసులో దారుణం

Manchiryal: ఆరుగురి స‌జీవ ద‌హ‌నం కేసులో రోజుకో సంచ‌ల‌న విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. ఈ ఘ‌ట‌న‌లో అన్నెం, పున్నెం ఎరుగ‌ని చిన్నారులు సైతం ప్రాణాలు విడిచారు. పెద్ద‌లు చేసిన త‌ప్పుల‌కు ఇద్ద‌రు చిన్నారులు విగ‌త‌జీవుల‌య్యారు. పెట్రోల్ పోస్తున్న స‌మ‌యంలో నిందితులు వారిని చూసినా అలాగే కాల్చేశారు….

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో ఆరుగురి స‌జీవ ఘ‌ట‌న‌లో హృద‌యాలు ద్ర‌వించే విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ విష‌యంలో ఎలాంటి ప్ర‌మేయం లేని వ్య‌క్తులు మ‌రణించ‌డం క‌న్నీరు తెప్పిస్తోంది. అక్ర‌మ సంబంధం నేప‌థ్యంలో శ‌నిగార‌పు శాంత‌య్య‌ను, ఆయ‌న‌తో సంబంధం ఉన్న ప‌ద్మ‌ను చంపాల‌ని నిందితులు భావించారు. అయితే, ఆ ఇంటికి చుట్ట‌పు చూపుగా వ‌చ్చిన మౌనిక ఇద్ద‌రు పిల్ల‌లు చ‌నిపోయారు.

ఈ ఘ‌ట‌న‌లో నిందితులకు ముందుగా వారు ఇంట్లో ఉన్న విష‌యం తెలియ‌దు. కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే ఉన్న‌ట్లు భావించారు. అయితే ఇంటిపై పెట్రోల్ పోస్తున్న స‌మ‌యంలో ముగ్గురిని చూసినా అప్ప‌టికే శాంత‌య్య మూడు సార్లు త‌ప్పించుకున్నాడ‌ని ఈసారి కూడా త‌ప్పించుకుంటే క‌ష్ట‌మ‌ని భావించి నిప్ప‌టించారు. శాంత‌య్య విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం అందించిన అదే గ్రామానికి చెందిన స‌మ్మ‌య్య అనే వ్య‌క్తి అన్న చిన్న పిల్ల‌ల ఏడుపు వినిపిస్తోంద‌ని చెప్పినా మ‌ద్యం మ‌త్తులో ఉన్న నిందితులు ప‌ట్టించుకోలేదు. దీంతో మౌనిక(24), ప్ర‌శాంతి(3), హిమబిందు అనే 18 నెల‌ల పాప కూడా మృత్యువాత ప‌డ్డారు.

ఇక ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఐదుగురు నిందితుల‌ను అరెస్టు చేశారు. నిందితులు వ‌దిలేసిన క్లూల‌తో పోలీసులు విచార‌ణ నిర్వ‌హించి నింద‌తుల‌ను ప‌ట్టుకున్నారు. మొద‌ట‌గా అక్క‌డికి తెచ్చిన పెట్రోల్ క్యాన్‌ల‌పై దృష్టి సారించి అవి ఎక్క‌డ ఉంచి తెచ్చార‌నే కోణంలో ఆరా తీశారు. పెట్రోల్ బంకుల్లో సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల‌ను గుర్తించ‌గ‌లిగారు. అదే స‌మ‌యంలో మ‌ద్యం కొనుగోలు, ఏ లాడ్జీలో బ‌స చేశార‌నే విష‌యంలో సైతం ఆరా తీసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచార‌ణ చేసి నిందితుల‌ను ప‌ట్టుకున్నారు.

ఈ కేసులో A1గా లక్ష్మణ్, A2గా సృజన, A3గా రమేష్, A4గా సమ్మయ్య, A5గా అంజయ్య నిందితుల పై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో సృజన ఇద్దరు కొడుకులు, బిడ్డకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు వెల్ల‌డించారు. ఈ కేసులో అయిదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అయిదుగురు నిందితుల పై హత్య, కుట్ర, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామ‌ని క‌మిష‌న‌ర్ వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like