సీపీఆర్ పై అంద‌రికీ అవగాహన అవసరం

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ప‌క్కన ఉన్న‌వారి ప్రాణాల‌ను ర‌క్షించ‌డానికి బీఎల్ఎస్ శిక్షణ చాలా ముఖ్యమ‌ని అట‌వీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. గురువారం బెల్లంప‌ల్లి ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొని మాట్లాడారు. సీపీఆర్(కార్డియో ప‌ల్మన‌రీ రీస‌సిటేష‌న్‌) చేయ‌డం తెలిస్తే ఎవరికైనా గుండెపోటు వ‌చ్చిన‌ప్పుడు వాళ్ల ప్రాణాల‌ను కాపాడే అవ‌కాశం ఉంటుందన్నారు. కరోనా తర్వాత సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరిగినట్లు వైద్య నిపుణులు పలు అధ్యయనాలు చెబుతున్నాయ‌న్నారు. అందుకే ముఖ్య‌మంత్రి కేసీఆర్.. సీపీఆర్ పై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించిన‌ట్లు తెలిపారు. ఈ మేరకు ప్ర‌జ‌ల కోసం మంచి కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. కార్డియాక్ అరెస్ట్ అయిన వారిని కాపాడేందుకు సీపీఆర్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

లైఫ్ సేవింగ్ టెక్నిక్స్ పై ఆశ వర్కర్స్, ఏఎన్ఎంలు పంచాయతీ కార్యదర్శులు, పోలీస్‌, మున్సిపల్ సిబ్బంది, అంగన్‌వాడీ సూపర్‌ వైజర్లు, పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్ సిబ్బందికి ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ రేణికుంట్ల ప్ర‌వీణ్ కుమార్‌ జిల్లా వైద్యాధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like