ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి

నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్

Medical Camp: ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ద వహించి జాగ్రత్తలు పాటించాలని నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని న్యూ నాగార్జున కాలనీలో డాక్టర్ కేర్ హోమియోపతి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నస్పూర్ బీఆర్ఎస్‌ అధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న, వంగతిరుపతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా కాలంలో హోమియోపతి మందులు ఉచితంగా పంపిణీ చేశారని ఇది అభినందనీయమన్నారు. హోమియోపతి వైద్యంలో సాధారణ, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స ఉంటుందని తెలిపారు. మెడికల్ క్యాంపు నిర్వహించిన వైద్యులను అభినందించారు. నస్పూర్ పట్టణ అధ్యక్షుడు సుబ్బన్న, సీనియర్ నాయకులు 22వ వార్డ్ కౌన్సిలర్ వంగ తిరుపతి, ప్రధాన కార్యదర్శి మెరుగు పవన్ మాట్లాడుతూ హోమియోపతి వైద్యంతో మెరుగైన చికిత్స అందుతుందన్నారు. కార్యక్రమంలో 150 మంది ప్రజలకు బీ.పీ చెకప్ నిర్వహించి ఉచితంగా మందులు పంపణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేర్ వైద్యుడు మల్లేష్, ఆసుపత్రి మేనేజర్ రజిత ఆరోగ్య సంరక్షణలపై అవగాహన కల్పించారు. వెంకట్ స్వామీ, బుర్ర రవి, యూత్ అధ్యక్షులు నరేష్, పార్టీ కార్యవర్గ సభ్యులు పులి రాజేందర్,రుకుమ్, తిరుమల్, అశోక్, చారి, వంశీ, మొగిలి, దేవన్న, రమేష్, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like