దిగివ‌స్తున్న ట‌మాట ధ‌ర‌లు

Tomato: ట‌మాట ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్నా మొన్న‌టి వ‌ర‌కు ఆకాశాన్నాంటిన ధ‌ర‌ల‌తో సామాన్యులు బెంబేలెత్తిపోయారు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా ఒక కేజీ టమాటా ధర సుమారు రూ. 150 నుంచి రూ. 200 సమీపానికి చేరుకుంది.దీంతో సామాన్యుల వంటకాలు నుంచి టమాట మాయమైపోయింది. అయితే, రెండు రోజులుగా టమాట ధ‌ర‌లు త‌గ్గుతున్నాయి. టమాటా అత్యధికంగా పండించే తమిళనాడు రాష్ట్రంలో ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా చిత్తూరు, మదనపల్లి అలాగే ఆంధ్ర కర్ణాటక బార్డర్లో టమాట సాగు అత్యధికంగా సాగవుతుంది. చెన్నై కోయంబేడు మార్కెట్లో టమాటా ధర 80 రూపాయలు ప‌లుకుతోంది. కర్ణాటకలోని చిక్బల్లాపూర్ మార్కెట్లో 70 రూపాయ‌ల నుంచి 80 రూపాయలు పలుకుతోంది. రాబోయే కొన్ని వారాల్లో టమాటా ధర సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశంలో ఉత్పత్తి అయ్యే టమాట పంటలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 70 నుంచి 80% ఉత్పత్తి అవుతుంది. గడచిన సంవత్సర కాలంగా టమాటా పంటకు గిట్టుబాటు ధరలు లభించలేదు. దీంతో రైతులు టమాటా పంట వేయ‌లేదు. దీనికి తోడు పశ్చిమ రాష్ట్రాల్లో బిపర్జాయ్ తుఫాను ప్రభావంతో పంట దెబ్బతిన్నది ఫలితంగా టమాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఇప్పుడు టమాటా పంట ఉత్పత్తి నెమ్మదిగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గుతున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లిలో టమాట రెండు వారాలుగా పోల్చితే పెరిగింద‌ని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మ‌రోవైపు ఉల్లి ధ‌ర పెరుగుతోంది. సాధారణంగా గృహిణు లు ఏ కూరకైనా టామాటా, ఉల్లి జత చేస్తారు. అక్టోబర్‌, నవంబర్‌లలో రూ.32 రూపా యలున్న ఉల్లి ధర ప్రస్తుతం రూ.55కు చేరింది. నాణ్య మైన ఉల్లిగడ్డ ధర రూ.60 వరకు పలుకుతోంది. వర్షాకాలంలో రెండవ పంటగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌తో పా టు తెలంగాణ ప్రాంతాల్లో నిజామాబాద్‌, నల్గొండ, జోగుళాంబ జిల్లాల్లో ఉల్లి సాగు చేస్తారు. పంట చేతికొచ్చే సమయానికి కురిసిన భారీ వర్షాలతో ఉల్లి పైర్లు దెబ్బతిని దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో తీవ్ర కొరత ఏర్పడింది. దీనికి తోడు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉల్లి దిగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి.

మహారాష్ట్ర హోల్‌సేల్‌ మార్కెట్లో ఉల్లిధర క్వింటాలుకు రూ.4 వేలు పలుకుతోంది. హైదరాబాద్‌ మార్కెట్లో నాణ్యమైన ఉల్లిగడ్డకు రూ.4,500 వరకు కూడా ధరలు పలుకుతున్నాయి. మరో మూడు నెల‌ల‌ వరకు ఈ ధరలు దిగివచ్చే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like