ఎమ్మెల్యే పేరిట హైదరాబాద్ లో ఫ్లెక్సీలు

BRS: డైరీ వ్యవహారం రోజురోజుకి ముదురుతోంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను వివాదం వీడటం లేదు. చిన్నయ్య తమ వద్ద డబ్బులు వసూలు చేశాడని, అమ్మాయిలను పంపించమన్నాడని ఆరీజన్ నిర్వాహకులు పెద్ద ఎత్తున అరోపణలు చేశారు. ఆరిజన్ డైరీ డైరెక్టర్ షేజల్ సైతం తనని లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఆ సంస్ధ తరచూ వీడియోలు విడుదల చేస్తూ ఎమ్మెల్యే తమకు అన్యాయం చేశాడని చెప్పుకొస్తున్నారు. బెల్లంపల్లిలో కేటీఆర్ పర్యటన సందర్భంగా బీజీపీ నేతలు చిన్నయ్య పై ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు.

ఇప్పుడు ఆరిజన్ డైరీ నిర్వాహకులు ఏకంగా హైదరాబాద్ లో ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయటం కలకలం రేపుతోంది. అది కూడా బీఅర్ ఎస్ పార్టీ కార్యాలయం తో సహా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. అక్కడే కాకుండా హైదర్ గూడా ఎమ్మెల్యే క్వార్టర్స్, పలు ఛానళ్ల కార్యాలయాల ఎదుట, బంజారాహిల్స్ చౌరస్తా, బీఎన్ ఎన్క్లేవ్స్, ఫిలింనగర్ ఇలా పలు చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. హైదరాాబాద్ లో దాదాపు 25 వరకు వీటిని ఏర్పాటు చేసినట్లు సమాచారం.

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అవినీతి పరుడు, కామపిశాచి అని అన్ని ప్రభుత్వ పథకాల్లో వాటాలు లేనిదే పనులు చేయడని అందులో పేర్కొన్నారు. తమ వద్ద డబ్బులు తీసుకుని ప్రభుత్వ భూమి కట్టబెట్టేందుకు ప్రయత్నం చేశారని ఆరిజన్ డైరీ నిర్వాహకులు వెల్లడించారు. అమ్మాయిలని పంపించాలని అడిగారని తాము ఆరుగురు అమ్మాయిలను ఎమ్మెల్యే క్వార్టర్ 404కి పంపినట్లు వెల్లడించారు. ఆ విషయంలో ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు తమపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాడని ఆరోపించారు. తమని అడ్డు తొలించుకునేందుకు కేసులు పెట్టించారని తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like