కొత్త గ్రంథాల‌య భ‌వ‌నాల‌కు రూ. 45 లక్ష‌లు

-బెల్లంపల్లి గ్రంథాలయంలో వాటర్ ప్లాంట్ కు రూ.5 ల‌క్ష‌లు
-గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్

Manchiryal: జిల్లాలో కొత్త గ్రంథాల‌యాలతో పాటు ఉన్న గ్రంథాల‌యాల్లో సీసీ కెమెరాల‌ ఏర్పాటు కోసం రూ.45 లక్షలు కేటాయించ‌నున్న‌ట్లు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ స్ప‌ష్టం చేశారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో స‌ర్వ‌స‌భ్య స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ మాట్లాడుతూ 2023-24 సంవ‌త్స‌రానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదించిన‌ట్లు వెల్ల‌డించారు. కొత్త గ్రంథాల‌యాల‌తో పాటు వేమనపల్లి గ్రంథాలయ భవనానికి ప్రహరీగోడ,గేటు, మరుగుదొడ్లు, నిర్మించేందుకు చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు చెప్పారు. బెల్లంపల్లి శాఖ గ్రంథాలయంలో R.0 వాటర్ ప్లాంట్ కు రూ. 5 ల‌క్ష‌లు అందించేందుకు ప్రణాళిక‌లు రూపొందించామ‌న్నారు. కొత్త జిల్లా ఏర్పడ్డాక మంచిర్యాల జిల్లాలోని గ్రంథాలయాలలో 5 సంవ‌త్స‌రాల నుంచి జరిగిన అభివృద్ధి గురించి 25-30 పేజీల సావరిన్ పుస్తకం ప్రచురణ గురించి బ‌డ్జెట్‌లో ఆమోదించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. పోటీ పరీక్షల కోసం ఆన్డిమాండ్ పుస్తకాలకు రూ. 5 ల‌క్ష‌లు కేటాయిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఈవో వెంకటేశ్వర్లు, డిపివో ఫణిందర్ రావ్, డిపిఆర్వో సంపత్, జిల్లా గ్రంథాలయ సెక్రటరీ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like