ఆడపిల్ల పుడితే ఉచిత వైద్యం..

Kagaznagar: ఆడపిల్ల పుట్టందంటే ఆర్దికంగా భారం అని భావించే వారు కొందరు, అయ్యో అనుకుని బాధ పడే వారు మరికొందరు అలాంటి వారి కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రి మంచి నిర్ణయం తీసుకుంది.

ఆడపిల్ల పుడితే ఆ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందిచేలా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కాగజ్‌నగర్‌ పట్టణంలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన షణ్ముఖ అనే హాస్పిటల్ యాజమాన్యం ఈ నిర్ణయం వెల్లడించింది. ఆడపిల్ల పుడితే ఉచితంగా ట్రీట్‌మెంట్‌ చేస్తామని ఆసుపత్రి నిర్వహకుడు యాద వినయ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. ఈ సంద్భంగా ఆయన నాంది న్యూస్తో మాట్లాడుతూ ఆసుపత్రి నిర్వహణ అంటే కేవలం డబ్బులతో ముడిపడి ఉన్న వ్యవహారం కాదన్నారు. ఎదుటి వారికి సాయ పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆడపిల్లను ఎవరూ కూడా భారంగా బావించవద్దని స్పష్టం చేశారు.

ఈ నిర్ణయంపై డాక్టర్లకు ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like