నిమ‌జ్జ‌నంలో అప‌శృతి.. ఇద్ద‌రు మృతి

Ganesh Disruption in immersion.. Two died: వినాయక చవితి ఆ ఇంట విషాదాన్ని నింపింది. వినాయక నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవ శాత్తు ఇద్దరు నీటిలో కొట్టుకుపోయారు. వారిలో ఒకరు మృతి చెందగా మరోకరు గల్లంతయ్యారు. గల్లంతైన అమ్మాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతీ సంవత్సరం వినాయక చవితి నిమజ్జనం సమయంలో అపశృతులు జరుగుతున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తోంది. అలాంటి ఘటనే అనంతపురం రాప్తాడు పండమేరులో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా రాప్తాడులో.. వినాయక విగ్రహం నిమజ్జనంలో విషాదం నెలకొంది. అనంతపురం సాయినగర్‌ వాసులు గణపతి నిమజ్జనం కోసం.. రాప్తాడులోని పండమేరు కాలువకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నలుగురు వ్యక్తులు నీటిలో పడిపోయారు. వారిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. శ్రీరాములు, జయశ్రీ అనే బాలిక ప్రవాహంలో కొట్టుకుపోయారు. శ్రీరాములు మృతదేహం లభ్యం కాగా.. గల్లంతైన బాలిక మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like