ఘ‌నంగా భ‌ట్టి విక్ర‌మార్క జ‌న్మ‌దిన వేడుక‌లు

Mallu Bhatti Vikramarka:సీఎల్పీ నేత‌ మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుక‌లు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేక్ కట్ చేసి భట్టి విక్రమార్కకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నాయ‌కులు మాట్లాడుతూ భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌జా నాయ‌కుడ‌ని స్ప‌ష్టం చేశారు. వెయ్యి కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర నిర్వ‌హించి ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నాడ‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జా ప్ర‌భుత్వం తెచ్చేందుకు త‌న వంతు పాత్ర పోషిస్తున్నార‌ని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, రఘునాథ్ రెడ్డి, పీసీసీ సభ్యులు కొండ చంద్రశేఖర్, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, ప్రధాన కార్యదర్శి పల్లవి, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి భానేశ్, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఖాలీద్, నస్పూర్ ఫ్లోర్ లీడర్ సూర్మిళ వేణు, మంచిర్యాల డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మజీద్, డీసీసీ సభ్యుడు ఆది సంజీవ్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు షేర్ పవన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట లావణ్య,పట్టణ ఉపాధ్యక్షురాలు రామగిరి శైలజ, నాయకులు బొల్లం భీమయ్య, శ్రీరాముల తిరుపతి, గట్టు స్వామి,దుస్స తిరుపతి,ఖదీర్, కళావతి,సరస్వతి రాథోడ్,రాధిక,విజయమ్మ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like