మాకు నివేదిక ఇవ్వండి

-తెలంగాణ అద‌న‌పు ఎస్పీ శిఖాగోయ‌ల్‌, డీజీపీకి జాతీయ‌ మ‌హిళా క‌మిష‌న్ లేఖ‌
-ఏం చ‌ర్యలు తీసుకున్నారో అందులో చెప్పండి
-షేజ‌ల్ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌

National Commission for Women: త‌న‌ను బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య వేధింపుల‌కు గురిచేస్తున్నాడ‌ని షేజ‌ల్ అనే మ‌హిళ చేసిన ఫిర్యాదు మేర‌కు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ స్పందించింది. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు తీసుకున్న చ‌ర్య‌లేంటి..? ఏం చేశారో..? తెల‌పాలంటూ జాతీయ క‌మిష‌న్ మ‌హిళా భ‌ద్ర‌తా విభాగం అద‌న‌పు ఎస్పీ శిఖాగోయ‌ల్‌, డీజీపీకి లేఖ రాసింది. షేజ‌ల్ ఫిర్యాదు చేసిన నేప‌థ్యంలో బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌, ఆయ‌న అనుచ‌రుల‌పై తీసుకున్న చ‌ర్య‌లేంటో చెప్పాల‌ని.. అన్ని విష‌యాలు ఆ నివేదిక‌లో పొందుప‌రిచి 15 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందించాల‌ని స్ప‌ష్టం చేసింది.

ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య, ఆయ‌న అనుచ‌రులు వేధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని, పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరిజ‌న్ డైరీ నిర్వాహకురాలు ఎన్నోమార్లు ఆరోపించారు. చివ‌ర‌కు తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద ఆత్మ‌హ‌త్య‌య‌త్నం కూడా చేశారు. అదే స‌మ‌యంలో జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించి జాతీయ మ‌హిళా క‌మిష‌న్ తెలంగాణ పోలీసుల‌కు నోటీసులు జారీ చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like