ప్రార్థనలకు వెళ్లి.. పరలోకానికి..

Road Accident: అప్పటి వరకు దైవసన్నిధిలో గడిపారు… ప్రార్థనలు చేశారు.. ఇంటికి వెళ్తున్న సమయంలో విధి మృత్యు రూపంలో కాటేసింది..

వివరాల్లోకి వెళితే.. గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొట్టిన ఘటనలో
ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు . ఐదుగురికి గాయాలయ్యాయి. ఇచ్చోడలో ఓ చర్చిలో తెల్లవారుజామున వరకు ప్రార్థనలలో పాల్గోని ఉదయం 4 గంటలకు ఆదిలాబాద్ వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. ఆటోలో వెళ్లిన వారంతా ఆదిలాబాద్ పట్టణనికి చెందిన వారిగా గుర్తించారు. మరణించిన వారిలో శైలజ(35), పొచ్చన్న (65), సలోమీ(62), గంగు(50) ఉన్నారు. ఈ ఘటనలో మడావి ప్రేమ్ సాగర్(46), మడావి దీపక్(15), తేజ వర్ధన్(12), ఆరాధ్య(2), చిన్ని 8 నెలలు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like