గోదావరిపై వంతెన నిర్మించాలి

బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్
-గోదావ‌రిలో దిగి నిర‌స‌న చేప‌ట్టిన బీజేపీ నేత‌లు

మంచిర్యాల : మంచిర్యాల – అంతర్గాం మధ్య గోదావరిపై వంతెన వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న నిర్వ‌హించారు. ప‌లువురు బీజేపీ నాయ‌కులు గోదావరీ నది లో మోకాలి లోతు వ‌ర‌కు దిగి నిరసన చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ 2018 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ గోదావరీ నది పై వంతెన నిర్మిస్తామని చెప్పి ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. వంతెన పేరుతో ప్రజల వద్ద ఓట్లు దండుకున్నారే తప్ప ఇప్పటి వరకు వంతెన నిర్మాణ పనులు కూడా ప్రారంభించలేదన్నారు. 2018 ముఖ్యమంత్రి ప్రకటన త‌ర్వాత‌ ఇక్కడి ఎమ్మెల్యే దివాకర్ రావు, నాయకులు కొబ్బరికాయలు కొట్టి, సంబరాలు చేసుకొని డబ్బా కొట్టుకున్నారే తప్ప ఇప్పటి వరకు బ్రిడ్జి నిర్మాణం గురించి మాట్లాడ‌లేద‌న్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం 2018 ఈ రాష్ట్ర ప్రభుత్వం 125 కోట్లు కేటాయించినట్లు GO ఇచ్చి ఇప్పటి వరకు టెండర్ కు పిలువలేద‌న్నారు. బ్రిడ్జి నిర్మాణం అయితే మంచిర్యాల, ఆసిఫాబాద్ ప్రజలకు దూర భారంతో పాటు వ్య‌య‌ప్ర‌యసాలు సైతం త‌గ్గుతాయ‌న్నారు. గోదావరి నదిపై వెంటనే బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించాలని భార‌తీయ జ‌న‌తా పార్టీ డిమాండ్ చేస్తోంద‌న్నారు. లేక‌పోతే బ్రిడ్జి నిర్మాణం అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పెద్దపల్లి పురుషోత్తం, అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేష్, కర్ణ శ్రీధర్, రజినిష్ జైన్, రేకందర్ వాణి, పట్టి వెంకట కృష్ణ, జోగుల శ్రీదేవి, బొద్దున మల్లేష్, ముదాం మల్లేష్, బొడకుంట ప్రభ, పూదరి రమేష్, బద్దరపు రాజమౌలి, కోడి రమేష్, విశ్వభర్ రెడ్డి, ఆకుల అశోక్ వర్ధన్, గాజుల ప్రభాకర్, ఈర్లా సదానందం, బోయిని దేవేందర్, అమిరిషెట్టి రాజు, పల్లే రాకేష్, పచ్చ వెంకటేశ్వర్లు, బల్ల రమేష్, పచ్చ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like