గ్రూప్-4 ప్రైమరీ కీ విడుదల..

TSPSC Group-4 Primary Key: గ్రూప్‌-4 ప్రిలిమినరీ కీని టీఎస్‌పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. కీలో అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. ప్రిలిమినరీ కీతోపాటు అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లు, మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్‌ను కూడా https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో కమిషన్‌ అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్‌ 27వ తేదీ వరకు అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ తెలిపారు. ప్రిలిమనరీ కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెల‌పాల‌ని సూచించారు. అభ్యర్థులు నేరుగా, పోస్టు , మెయిల్‌ ద్వారా తెలిపిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమ‌న్నారు. అభ్యంతరాలకు సంబంధించి ఆధారాలను తప్పనిసరిగా పీడీఎఫ్‌ ఫార్మట్‌లో జతచేయాలని తెలిపారు.

తెలంగాణలో 8,180 గ్రూప్‌-4 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీని కోసం 2878 ఎగ్జామ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్-4 పేపర్‌-1 జనరల్ స్టడీస్ కు 7,62,872 మంది హాజరు కాగా.. పేపర్-2 సెక్టరేరియల్ ఎబిలిటీస్ కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష జులై 1న నిర్వహించగా.. ఇప్పటి వరకు ఎలాంటి అప్టేట్ రాకపోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అయ్యింది. ఎట్టకేలకు ఓఎంఆర్ షీట్లు, ప్రైమరీ కీ విడుదల చేయడంతో ఫలితాల విడుదలకు సంబంధించి తొలి అడుగు పడినట్లైంది. కీ అభ్యంతరాలకు సంబంధించి కీ నిపుణుల కమిటీ వేయనున్నారు. దీని తర్వాత ఫైనల్ కీ విడుదల చేస్తారు. ఇదంతా సెప్టెంబర్ లో పూర్తి అయితే.. అక్టోబర్ మొదటి వారంలో గ్రూప్ 4 ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు, తాజా అప్డేట్స్ కోసం అధికారిక వెబ్ సైట్ ను https://www.tspsc.gov.in/ సందర్శించాలని టీఎస్పీఎస్సీ సూచించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like